![]() |
![]() |
.webp)
రౌడీ రోహిణి తన అక్క అనురాధ పుట్టినరోజును తన పుట్టినరోజేమో అన్నంతగా సెలెబ్రేట్ చేసింది. రోహిణి కొత్త డ్రెస్ వేసుకుని పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళింది పూజ చేసింది. తన అక్క పుట్టినరోజప్పుడు కొత్త బట్టలు వేసుకుంటుందో లేదో కానీ తాను మాత్రం తన అక్క బర్త్ డేకి కచ్చితంగా కొత్త బట్టలు వేసుకుంటాను అని చెప్పింది. తాను వేసుకున్న డ్రెస్ కూడా తన సిస్టర్ కొనిచ్చింది అని చెప్పింది. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరిలో ఎవరి బర్త్ డే ఐనా కూడా ఇద్దరూ రెడీ అవుతామని చెప్పింది. అలాగే సాయంత్రం ఫంక్షన్ హాల్ కి అందరినీ ఇన్వైట్ చేసారు.
వాళ్ళ అక్క ఫ్రెండ్స్ అంతా వచ్చేసరికి వాళ్లందరినీ పరిచయం చేసింది. ఇక రోహిణి ఫ్రెండ్స్ పవిత్ర, యాదమ్మ రాజు, స్టెల్లా, పటాస్ ప్రవీణ్, షబీనా, జబర్దస్త్ ఇమ్మానుయేల్, బాబు వచ్చారు. ఇక రోహిణితో పాటు వాళ్ళ పేరెంట్స్ కలిసి ఒక గోల్డ్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ ని బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక తన సిస్టర్ తన కోసం ఎంతో చేసింది అని అలాగే తన కోసం ఎప్పుడూ తోడుగా ఉంటానని ఈ సందర్భంగా రోహిణి మాటిచ్చింది. అలాగే ఈ పార్టీకి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పింది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకుంది రౌడీ రోహిణి. ఒక టీమ్ లో కామెడీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. తన కామెడీ టైమింగ్ తో అందరికీ ఫేవరేట్ ఐపోయింది. మొట్టమొదటి లేడీ టీమ్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ కామెడీ టైమింగ్ తో మూవీస్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది రోహిండి. రీసెంట్ గా కాలిలో రాడ్ తీయించుకుని సర్జరీ చేయించుకుంది. అలా కొంత కాలం టీవీకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ రిఎంట్రీ ఇచ్చింది. ఇక షోస్ లో బాగా కనిపిస్తోంది రోహిణి. ఈమధ్య జబర్దస్త్ లో ఆటో రాంప్రసాద్ తో కలిసి ఎక్కువ స్కిట్స్ చేస్తోంది రోహిణి.
![]() |
![]() |